నా పేరు కంఠిమహంతి ప్రమీలాదేవి. నా భర్త బి.విజయారావు, కాకినాడ డి.ఇ.ఓ.ఆఫీసు లో అసిస్టెంటు డైరెక్టర్ గా పసిచేస్తున్నారు. మా కుటుంబం పిల్లల చదువు నిమిత్తం కాకినాడ శ్రీనగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న Shalom Worship Centre కి వెళ్ళడం ప్రారంభించాము. ఇప్పటికి 8 సంవత్సరములు గా వెళ్తున్నాము.
మా అబ్బాయి Samuel Anudeep అప్పుడు 10th క్లాసు చదువుతుండేవాడు. తనకి దేవుని యందు భయభక్తలు ఉన్నప్పటికి అంతగా అవగాహన ఉండేది కాదు.ఈ చర్చికి వెళ్ళడం ప్రారంభించాక అక్కడ Pastor Prasad గారు అందరికి స్పష్ఠంగా అర్ధమైయ్యేలా వాక్యం భోదించుట వలన మా అబ్బాయి ఎంతో శ్రద్ధ తో వాక్యాన్ని వినేవాడు. ఆ వాక్యాన్ని తన అనుదిన జీవితానికి అన్వయించుకొని దేవుని తట్టు తిరిగి అన్ని విషయాలలో దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టాడు. దేవుడు తనకి చదువంతటిలో తోడుగావుండి అద్భుతరీతిలో తనకి IIT Kharagpur లో సీటు రావడానికి దేవుడు సహాయం చేసారు. ఇప్పుడు Hyderabad Microsoft లో Software Development Engineer గా ఉద్యోగం పొందడానికి ప్రభువు కృప చూపించారు.
దేవుని కే మహిమ కలుగును గాక !